Posts

శ్రీ భగవద్గీత అథః ప్రథమోధ్యాయః

Image
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః   శ్రీ భగవద్గీత  అథః ప్రథమోధ్యాయః కం. అంతట ధృతరాష్ట్రుడు  తన  చెంతకు సంజయుని పిలిచి   చెప్పు మమాత్యా,  సుంతయు వీడక   యుద్ధం బంతయు నే రీతి జరుపబడెనో అచటన్.... (0)   సీ. ధర్మక్షేత్రం బది- తగ కురుక్షేత్రంబు,  అందుయుద్ధము చేయ -  నభిలషించి,  నా కుమారులు, మరి- నా సోదరుడు పాండు  భూపాలతనయులా - ప్రొద్దునందు,  ఏమి చేసిరి? అన స్వామికి సంజయుం  డీరీతి పలికె నో కురునరేంద్ర! పాండవానీకంబు -పరికించి రారాజు  గురు కుంభసంభవు- దరికి చేరి  పలికె నీ రీతి కంటిరే -బాగ తమరి  శిష్యుడా దృష్ట దుమ్యుని -చేష్ట లతని   చేత విరచిత వ్యూహాన- సేన బలిమి   వారి పక్షాన నిలిచిన- వీరవరుల....(1,2,3). కం. వారు మహారథు లందరు,  వీరత్వమునందు భీమ- భీభత్స సముల్,  వారల పేర్లెరిగించెద   వేరొక పర్యాయమిపుడు- విన ప్రార్థింతున్..... (4) సీ. సమర కళాశాస్త్రి -సాత్యకి కలడందు,  రణ పండితుండు- విరాటుడుండె,  పాంచాల పతి వారి -పక్షాన నుండెను,  దృష్టకేతును చేకితానుడుయును,...